- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Flood Relief Fund : వరద బాధితులకు చేతనైన సహాయం చేయండి.. సీఎం రేవంత్ మరోసారి సందేశం
దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎంఓ ఒక ప్రకటన చేసింది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని రేవంత్ రెడ్డి కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని సీఎం అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, చెక్కుల రూపంలో గానీ లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి గానీ పంపవచ్చని సీఎంఓ స్పష్టం చేసింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సీఎస్ఆర్ కింద విరాళాలు అందించే సంస్థలు కింద ఇచ్చిన రెండో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది.