మురుగు నురుగలైనా సెల్ఫీలకు హిమగిరులే

by Y. Venkata Narasimha Reddy |
మురుగు నురుగలైనా సెల్ఫీలకు హిమగిరులే
X

దిశ, వెబ్ డెస్క్ : వెర్రికి వేయి తలలన్నట్లుగా సెల్ఫీలకు కాదేది అనర్హమన్న తీరు లోకం పోకడ సాగుతోంది. జలపాతాలు..మంచుకొండల సోయగాలతో సెల్ఫీలు దిగడం మనం చూస్తుంటాం. కాని మురుగు నీటి నురగలతోనూ సెల్ఫీలు దిగడం నెక్స్టు లెవల్ అనుకోవాలేమో మరి. తమిళనాడులోని కెలవరపల్లి డ్యాం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. డ్యాం నీటిలో భారీగా రసాయన వ్యర్థాలు కలవడంతో దిగువన జాతీయ రహదారిపై కాజ్ వే వద్ధ కాలుష్యపు నీటి నురగలు మంచు కొండలా పేరుకుపోయాయి. ఇంకేముంది ఆ దారిన వెలుతున్న కొందరు మంచు కొండలను తలపిస్తున్న మురుగు నురుగల వద్ద సెల్ఫీలు దిగుతూ తమ ముచ్చట తీర్చుకున్నారు.

అటుగా వెలుతున్న వాహనదారులు మాత్రం ఇదేం సెల్ఫీల పిచ్చిరా బాబు అనుకుంటూ మంచుకొండల్లా కనిపిస్తున్న కాలుష్యపు నీటి నురగలను చూస్తూ విస్మయం వ్యక్తం చేశారు. జల కాలుష్యానికి ఆ దృశ్యం నిలువెత్తు నిదర్శనంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఆ వీడియోలను చూసిన తెలుగు నెటిజన్లు మాత్రం సరిగ్గా ఆ కాలుష్యపు నీటి నురగలు తెలంగాణలోని మూసీ నది జల కాలుష్యపు నురగలను తలపించాయని గుర్తు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed