Labourers killed: వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు కార్మికులు మృతి.. పూణేలో విషాదం

by vinod kumar |
Labourers killed: వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు కార్మికులు మృతి.. పూణేలో విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణే జిల్లాలొ విషాదం చోటు చేసుకుంది. పింప్రి చించ్‌వాడ్ టౌన్‌షిప్‌లోని భోసారి ప్రాంతంలో లేబర్ క్యాంపు వద్ద నిర్మించిన తాత్కాలిక వాటర్ గ్యాంక్ గురువారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కార్మికులు ట్యాంక్ కింద స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. వాటర్ ట్యాంక్‌లో నీరు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి వల్ల ట్యాంక్ గోడ పగిలి కూలి పోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్యాంక్ పడిపోగానే దాని కింద ఉన్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని ఈ క్రమంలోనే ముగ్గురు మరణించారని స్థానికులు తెలిపారు. అయితే ట్యాంక్ నిర్మాణం నాసిరకంగా చేపట్టారని, అందుకే కూలిపోయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed