విశాఖలో విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ.. ఆ భూములపై కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-24 12:28:36.0  )
విశాఖలో విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ.. ఆ భూములపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) విశాఖలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జిగా ఆయన గతంలోనే పని చేశారు. పలు విమర్శలు రావడంతో వేరే ప్రాంతానికి నియమించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన అధినేత వైఎస్ జగన్(YS Jagan) రాష్ట్రం మొత్తాన్ని ఆరు భాగాలుగా విభజించి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు విజయసాయిరెడ్డిని ఇంచార్జిగా నియమించారు. దీంతో ఆయన విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) మాట్లాడుతూ కార్యకర్తల్లో విశ్వాసం నింపి మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. గతంలో జరిగిన భూదందాల్లో తన ప్రమేయం లేదని తెలిపారు. దసపల్లా, ఎన్‌సీసీ భూముల(Dasapalla, NCC lands) ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసినా తమకు ఇబ్బంది లేదని తెలిపారు. జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా పార్టీ నేతలు స్వీకరిస్తారని తెలిపారు. ఈసారి పార్టీని విజయపథంలో నడిపించేందుకు ఆహర్నిశలు కృషి చేస్తానన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను అన్ని విధాలుగా సంతృప్తి పరుస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Visakha Steel Plant Privatization)జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) విఫలమయ్యారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ(YCP) వ్యతిరేకమని తాము చెప్పామని, తాను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. స్టీల్ ప్రాంట్ విషయంలో ప్రజలను కూటమి ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు. 100 రోజుల్లోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Advertisement

Next Story