వామ్మో బాలయ్య..చంద్రబాబుల క్రేజ్..ఆ రోజు సెలవు కావాలని ఉద్యోగుల ప్రదర్శన

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-24 12:13:25.0  )
వామ్మో బాలయ్య..చంద్రబాబుల క్రేజ్..ఆ రోజు సెలవు కావాలని ఉద్యోగుల ప్రదర్శన
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీ ఆహా 'అన్‌స్టాపబుల్‌ 4’ (Unstoppable) షో పట్ల జనాల్లో ఏర్పడిన క్రేజ్ మామూలుగా కనిపించడం లేదు. బాలయ్య తన బావ, ఏపీ సీఎం చంద్రబాబు తో చేసిన సీజన్ 4 తొలి ఎపిసోడ్ రేపు శుక్రవారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి టీజర్ విడుదలైంది. సరదాగా, చమత్కారంగా సాగుతూనే అనేక ఆసక్తిర అంశాలపై ప్రశ్నలతో బాలయ్య ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ షో స్ట్రీమింగ్‌ డేను బాలయ్య పండుగగా ప్రకటించాలని, ఆ రోజు తమకు సెలవు ఇవ్వాలంటూ హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారమంతా చూస్తే బాలయ్య అన్ స్టాపబుల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందోనంటూ ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. కాగా చంద్రబాబు అరెస్టు సందర్భంగానూ హైదరాబాద్ లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు ఆహాలో చంద్రబాబుతో సాగిన బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ చూసేందుకు సెలవు కోరుతూ ప్రదర్శనలు నిర్వహించడం చూస్తే ఐటీ ఉద్యోగుల్లో చంద్రబాబు క్రేజ్ కు నిదర్శనంగా కనిపిస్తుంది. ఉద్యోగుల ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా బాలయ్య చంద్రబాబుతో సాగిన అన్ స్టాపబుల్ టాక్ షోలో ఎన్నో విషయాలు మాట్లాడించారు. రాష్ట్ర భవిష్యత్తు, పవన్‌తో భేటీ, ఇద్దరి మధ్య చర్చలు, జైలులో ఉన్న 53 రోజులు ఎలా గడిచాయి వంటి విషయాలతోపాటు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. బాబుకి బాలయ్య ఫన్నీ టాస్కులు ఇచ్చినట్లు చూపించారు. అందులో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. సరదాగా, చమత్కారంగానూ మాట్లాడారు. తన తరహాలో తొడ కొట్టాలని, లేకుంటే పవన్‌ కళ్యాణ్‌ మేనరిజం చేసి చూపించమని చంద్రబాబును కోరినట్లుగా టాక్. చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రశ్నలు వేశాడని, తమ పాలనలో రెడ్ బుక్ పై సాగుతున్న ప్రచారం, భవిష్యత్తులో టీడీపీని లోకేష్ సమర్థవంతగా నడిపిస్తారా ? అమరావతి అందరికి రాజధానా? వంటి ఎన్నో ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు సమాధానాలుంటాయన్న ప్రచారం ఈ టాక్ షోపై మరింత ఆసక్తి పెంచుతోంది.

Advertisement

Next Story