హైడ్రా, మూసీ సుందరీకరణపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by M.Rajitha |   ( Updated:2024-10-24 10:08:05.0  )
హైడ్రా, మూసీ సుందరీకరణపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(Hydra), మూసీ(Musi) సుందరీకరణపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించారు. మా ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే పేదలు, రైతులు, మహిళల కోసం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కావాలనే మాపై బురద జల్లుతున్నారని మండిపడ్డ మహేష్ కుమార్ గౌడ్.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు సోషల్ మీడియాలో భారీగా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు.. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులపై ప్రజల మనసుల్లో అపనమ్మకాలను పెంచుతున్నారని అన్నారు. ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడకుండా.. వాస్తవాలను గ్రహించాలని సూచించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇస్తే.. మేము కేవలం 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేశారు. హైడ్రా ద్వారా చెరువుల, కుంటల ఆక్రమణ దారులకు భయం పుట్టేలా చేశామని.. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు ఆక్రమించి వర్షపు నీరు కాలువల్లోకి వెళ్ళకుండా చేసి.. చిన్న వర్షాలకే నగరం జలమయం అయ్యేలా చేస్తే బాగుంటుందా అని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళన వలన మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా జీవించేలా చేస్తామని, మూసీ నదికి పర్యాటక శోభ తెస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed