అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

by Sridhar Babu |
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొనియాడారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసు చట్టాలు, కేసులఛేదన, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగాలు, డాగ్, బాంబ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు, మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీం, భరోసా సెంటర్, సైబర్ నేరాలు, పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్ స్టేషన్ పనితీరు, డయల్ 100 గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వారి త్యాగాలను స్మరిస్తూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి, పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై వివరించారు. విద్యార్థులు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని, పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ కృష్ణ, ఆర్ఐలు యాదగిరి, రమేష్, మధుకర్, ఆర్ఎస్ఐ సాయికిరణ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed