ల్యాప్రోస్కోపిక్ పద్ధతితో మహిళ కిడ్నీ ఆపరేషన్

by Naveena |
ల్యాప్రోస్కోపిక్ పద్ధతితో మహిళ కిడ్నీ ఆపరేషన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్‌ హాస్పిటల్ లో శరీరంపై కోతలు లేకుండా ల్యాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా ఓ మహిళకు కిడ్నీ ఆపరేషన్ చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నగరంలోని ఆటోనగర్‌కు చెందిన మహిళ తరచూ నడుంనొప్పి, ఇన్‌ఫెక్షన్‌, జ్వరంతో ఇబ్బందులు పడుతూ.. హాస్పిటల్ కు వచ్చింది. ఆమెకు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించగా కుడివైపు కిడ్నీ పూర్తిగా పాడైనట్లు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో కచ్చితంగా ఆమెకు ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించాలని డాక్టర్‌‌లు సలహా ఇచ్చారు. లేదంటే సమస్య పెద్దదవుతుందని చెప్పడంతో..ఆపరేషన్ కు బాధిత మహిళ ఒప్పుకుంది. దీంతో ఆమెకు హాస్పిటల్ లో ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యురాలజిస్ట్‌, ఎండ్రాలజిస్ట్‌, లేజర్‌ సర్జన్‌ సతీష్‌ మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగికి పరీక్షలు నిర్వహించి,ఎలాంటి కోతలు లేకుండా కుడివైపు కిడ్నీని విజయవంతంగా తొలగించామని మీడియాకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రక్రియలో అనస్తీషియా వైద్యులు వను, ఆస్పత్రి ఇన్‌చార్జి స్వామి, డీఎంఎస్‌ యాజ్ఞ, మార్కెటింగ్‌ హెడ్‌ వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed