కాపాడతాడనుకుంటే నాతోనే అలా ప్రవర్తించాడు.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-24 15:49:00.0  )
కాపాడతాడనుకుంటే నాతోనే అలా ప్రవర్తించాడు.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అవికా గోర్(Avicka Gore) బుల్లితెర సీరియల్ ‘చిన్నారి పెళ్లి కూతురు’ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పన్నెండేళ్ల వయసులోనే నటన రంగంలోకి వచ్చిన అవిక అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. పలు చిత్రాల్లో నటించి తన నటన, అందం, అభినయంతో మెప్పించి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా గోర్(Avicka Gore) షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నన్ను కాపాడుతాడని ఓ వ్యక్తికి నేను బాడీ గార్డుగా ఉద్యోగం ఇచ్చాను.

కానీ నాతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ ఈవెంట్‌లో నన్ను బాడీగార్డు (bodyguard)దారుణంగా తాకాడు. అతను రెండు సార్లు అలాగే ప్రవర్తించడంతో నేను ఏంటి అని అడిగాను. వెంటనే నాకు సారీ చెప్పాడు. వారు అలా ప్రవర్తించినప్పుడు అది ఇతరులపై ఎంత ప్రభావం చూపిస్తుందో వారికి తెలియదు. నన్ను తాకిన ఆ బాడీగార్డు(bodyguard)ను కొట్టే ధైర్యం నాకు అప్పుడు లేదు. కానీ ఇప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కొట్టగలను అని అనుకుంటున్నాను. అయితే నేను పెద్దయ్యాక ఎన్నో హింసలు, సవాళ్లు ఎదుర్కొన్నాను. నా లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed