BJP Candidate List: ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

by Shamantha N |   ( Updated:2024-10-24 08:12:31.0  )
BJP Candidate List: ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగగా ఆ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్ లో కుందార్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ నుంచి సురేంద్ర దిలర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కటేహరి నుంచి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుంచి బీజేపీ నుంచి ఏకైక మహిళా అభ్యర్థి సుచిష్మితా మౌర్య ఉన్నారు. ఇకపోతే, రాజస్థాన్ లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనుండగా..కాషాయ పార్టీ ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. చోరాసి (ఎస్టీ) స్థానం నుంచి కరిలాల్ ననోమాను కమలం పార్టీ బరిలోకి దింపింది.

సీట్ల పంపిణీపై జేపీ నడ్డాతో చర్చ

ఇకపోతే ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌తో పాటు సంజయ్ నిషాద్ కూడా ఢిల్లీలో క్యాంప్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశమై సీట్లపై చర్చ కూడా జరిగింది. బుధవారం వారితో సీట్ల పంపకాలపై చర్చ జరిగిన తర్వాత అభ్యర్థి పేరు ఖరారైంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ వేయడానికి అక్టోబర్ 25 చివరి తేదీ. ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 13న జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed