- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువు కోరారు. దీంతో ఈ కేసు విచారణను కోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. తమ పార్టీలో గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని వీరిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో చెప్పేందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నామని ఆలోగా వివరాలు అందజేయకుంటే మేమే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ బెంచ్ తేల్చి చెప్పింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన తదుపరి విచారణ వాయిదా వేసింది.