Maharashtra Polls: కర్ణాటక, తెలంగాణ సరిహద్దులు మూసివేయాలని ఈసీకి శివసేన ఫిర్యాదు

by Shamantha N |   ( Updated:2024-10-24 07:43:35.0  )
Maharashtra Polls: కర్ణాటక, తెలంగాణ సరిహద్దులు మూసివేయాలని ఈసీకి శివసేన ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలను మహారాష్ట్రకు తరలిస్తున్న కొంతమంది వ్యక్తులకు కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను అప్పగించిందని ఆరోపించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బుల వరద పారుతోందని శివసేన నేత పావస్కర్ ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులను సీల్ చేయాల్సిన అవసరం ఉందని ఈసీకి ఫిర్యాదు చేశారు.

విదేశాల నుంచి నిధులు

మహా వికాస్ అఘాడికి కర్ణాటక, తెలంగాణ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నిధులు వస్తున్నాయని పావస్కర్ అన్నారు. కాగా.. ఈ నిధులపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డబ్బుని విచ్చలవిడిగా కాంగ్రెస్ ఖర్చుపెట్టిందని చెప్పుకొచ్చారు. ఆ ప్రభావం మహాయుతి కూటమిపై పడిందని అన్నారు. అందుకే సరిహద్దుల్ని సీల్ చేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed