Kriti Sanon: ఒకే రంగంలో ఉంటే ఆమెతో నన్నెలా పోలుస్తారు.. కృతి సనన్ ఫైర్

by Hamsa |   ( Updated:2024-10-24 15:50:41.0  )
Kriti Sanon: ఒకే రంగంలో ఉంటే ఆమెతో నన్నెలా పోలుస్తారు.. కృతి సనన్ ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) ‘దో పత్తి’(Do Patti) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్‌లో పాల్గొన్న కృతి తనను నుపూర్‌తో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ నా చెల్లి నుపూర్ సనన్(Nupur Sanon) నేను చాలా సరదాగా ఉండటంతో పాటు అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము. తను కూడా ఇటీవల సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. విభిన్నమైన చిత్రాల్లో యాక్ట్ చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది. అయితే మేమిద్దరం ఒకే రంగంలో ఉండటం వల్ల మా బంధువులు కొందరు మాత్రం మమ్మల్ని పోల్చి చూస్తున్నారు.

నాతో ఒక రకంగా తనతో మరోలా ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తన నాకు నచ్చక నేను చాలా సార్లు కోపం తెచ్చుకున్నాను. మా ఇద్దరినీ పోల్చి చూడాల్సిన అవసరం ఏముంది? తను ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రోజులు కాలేదు. నేను సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు తను చిన్న పిల్ల. నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా పోలుస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ కృతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story