ఆ మైనర్ బాలికను ఆదుకోండి : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

by Y. Venkata Narasimha Reddy |
ఆ మైనర్ బాలికను ఆదుకోండి : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
X

దిశ, వెబ్ డెస్క్ : గత శుక్రవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో 5 వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పందించారు. ఈ మేరకు గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నాగేష్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వయంగా గవర్నర్ దత్తాత్రేయ సిద్ధిపేట జిల్లా పోలీస్ కమీషనర్ అనురాధకు ఫోన్ చేసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే బాలికకు కస్తూరిభా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి నిందితుడు షెరీఫుద్దీన్ ని కఠినంగా శిక్షించాలని బండారు దత్తాత్రేయ కోరారు. దత్తాత్రేయ వినతిపై సానుకూలంగా స్పందించిన పోలీస్ కమీషనర్ బాలిక ఉన్నత చదువులకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.

Advertisement

Next Story