- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Big alert.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దిశ, వెబ్‌డెస్క్: గత మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే మరో మూడు రోజులు పాటు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్ కుమురంబీం, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అలాగే కుమురంభీ జిల్లా ఆసిఫాబాద్ మండలం చోర్‌పల్లిలో పిడుగు పడి అంజన్న యువకుడు మృతి చెందాడు.