- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ అలర్ట్ .. మరో నాలుగు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన
by samatah |
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. (శుక్రవారం) నిన్నటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షం పడుతున్న విషయం తెలిసిందే. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే అవకాశముంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్, కుమురంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Next Story