CM Revanth : గత పదేళ్ల చీకట్లు తొలిగాయి.. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

by Ramesh N |
CM Revanth : గత పదేళ్ల చీకట్లు తొలిగాయి.. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: Telangana తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth Reddy దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత సర్కార్‌ పదేళ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలిగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ వెలుగులు విరజిమ్ముతోందని వెల్లడించారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

కాగా, దీపావళి Diwali పండుగ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ BRS KCR కూడా దీపావళి విషెస్ చెప్పారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ వెల్లడించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరిసంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed