- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah: కెనడాలో హత్య కుట్రలో అమిత్ షా!
దిశ, నేషనల్ బ్యూరో: భారత దేశంపై బురదజల్లడానికి కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కెనడా(Canada)లో ఖలిస్తానీ ఉగ్రవాది(Khalistani Terrorist) హత్య కుట్రలో భారత కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) పేరును తొలిసారిగా ప్రస్తావించింది. ఆ దేశ విదేశాంగ వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మారిసన్(David Morrison) నోటి నుంచి ఈ మాట రావడం గమనార్హం. డేవిడ్ మారిసన్ మాట ఆధారంగానే ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం ప్రచురించినట్టు స్పష్టత వచ్చింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.
అమెరికా న్యూస్ పేపర్‌కు ఈ కుట్ర వెనుక అమిత్ షా హస్తమున్నదని తానే చెప్పానని కెనడా పార్లమెంటరీ ప్యానెల్ ముందు డేవిడ్ మారిసన్ అంగీకరించారు. ‘ఆ పత్రిక జర్నలిస్టు నాకు కాల్ చేసి ఆ కుట్ర వెనుక ఉన్నది ఆయనే(అమిత్ షా)నా అని అడిగాడు. ఔను ఆయనే అని నేను కన్ఫమ్ చేశాను’ అని మారిసన్ వివరించారు. భారత అధికారులకు అమిత్ షా ప్రమేయం ఉన్నదని కెనడా అధికారులు చెప్పారని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఇటీవలే ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అందుకు ఆధారాలు అడగ్గా కెనడా అధికారులు ఏమీ చూపించలేదు. అమిత్ షా పాత్ర ఉన్నట్టు భారత్‌కు కెనడా చెప్పిందని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. కానీ, ఆ సమాచారం పకడ్బందీగా లేదని, విశ్వసనీయంగానూ లేదని వివరించారు. అది అమిత్ షాకు లేదా కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు తీసుకువచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.