Gold Rates : దీపావళి రాకెట్ లా దూసుకుపోతున్న బంగారం ధరలు

by M.Rajitha |
Gold Rates : దీపావళి రాకెట్ లా దూసుకుపోతున్న బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో బంగారం ధరలు(Gold rates) దీపావళి రాకెట్లా దూసుకు పోతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో రూ.82 వేలు దాటింది. 24k స్వచ్ఛమైన మేలిమి బంగారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ.82,400కు చేరింది. ఇక 22k స్వచ్ఛమైన బంగారం కూడా రూ.82 వేల మార్కును చేరింది. అలాగే వెండి ధరలు కూడా నేడు అమాంతం ఎగబాకాయి. కిలో వెండి రూ.1300 పెరిగి రూ.1.01 లక్షలకు చేరింది. కాగా గతేడాది దీపావళి నాటికి 10గ్రా. స్వచ్చమైన బంగారం ధర రూ.61,200 ఉండగా ఒక్క ఏడాదిలోనే రూ.20 వేలకు పెరగడం గమనార్హం. దీపావళి పండగ వేళ బంగారం కొనుగోళ్లు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఏడాది భారీగా కొనుగోళ్లు ఉండటంతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే అంచనాలు.. వెరసి బంగారానికి డిమాండ్ పెంచేశాయి. ఇక అంతర్జాతీయ కమొడిటి ఎక్సేంజ్ లో నేడు ఔన్సు బంగారం 2797.90 డాలర్లుగా ఉంది.

Advertisement
Next Story

Most Viewed