- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మందు బాబులకు అడ్డాగా దేవాలయాలు..
దిశ ,మేళ్లచెరువు : దేవాలయ సమీపంలో రాత్రి వేళలో గుంపులుగా మందుబాబులు కనిపిస్తున్న దృశ్యాలు తరచూ జరుగుతున్నాయి. మేళ్లచెరువు లో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామీ వారి దేవాలయం కబడ్డీ కోర్టు వద్ద అయ్యప్ప స్వామి,తిరుపతమ్మ దేవాలయం వెనుక భాగం జనసంచారం తక్కువగా ఉండడంతో.. ప్రాంతం రాత్రివేళ నిర్మానుషంగా ఉండి మందుబాబులకు అడ్డగా మారింది. ప్రతిరోజు రాత్రి 7 గంటల తర్వాత ఈ ప్రాంతంలో గుంపులుగా కొందరు త్రాగు బోతులు బీరు, బ్రాందీ ,సారా, వంటి ఇతర మత్తు పానీయాలు సేవించి..గొడవలకు దిగుతున్నట్టుగా ఇటీవల కొన్ని సంఘటనలు వెలిగులోకి వచ్చాయి. మంగళవారం రాత్రి తాగుబోతులు దేవాలయ వద్ద కొందరు మత్తు పానీయాలు సేవిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని నిర్బంధించి స్టేషన్ కు తీసుకువెళ్లినట్లుగా సమాచారం. కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజాము రాత్రి వేళలో దేవాలయానికి వచ్చే భక్తులకు తాగుబోతుల నుండి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగచ్చున భావన భక్తుల్లో నెలకొంది . ఆఫ్కారి, పోలీస్ శాఖలు తాగుబోతులు ఈ ప్రాంతంలో సంచరించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.