- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణహాని
దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని ఓ రసాయన పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, పరిశ్రమ కార్మికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారు జామున నాలుగున్నర గంటల సమయంలో కార్మికులు రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో రసాయనాల మధ్య ఒత్తిడి ఎక్కువై ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి.
అప్రమత్తమైన పరిశ్రమ యాజమాన్యం మంటలను ఆర్పేలా చర్యలు చేపట్టారు. అనంతరం పటాన్ చెరు, జీడిమెట్ల, నర్సాపూర్ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి రెండు గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని పరిశ్రమ యాజమాన్యం, పోలీసులు తెలిపారు. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని, మంటలు సకాలంలో పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయని సీఐ తెలిపారు.