- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జాకు గురైన బోయినపల్లి మార్కెట్ యార్డు..
దిశ, తిరుమలగిరి : దేశంలోనే పేరొందిన అతిపెద్ద కూరగాయల మార్కెట్లలో ఒకటైన బోయినపల్లి మార్కెట్ యార్డు నడ్డి మధ్యలో అక్రమార్కులు దర్జాగా కబ్జా చేసి అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం శోచనీయం. సికింద్రాబాద్ బోయినపల్లిలోని మార్కెట్ యార్డులో లక్షలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం నుండి లైసెన్సులు పొందివారు కూరగాయల వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డులో లైసెన్స్ కలిగిన ఓ దుకాణ యజమాని అండదండలతో అక్రమార్కులు యార్డు లోపల రోడ్డుకు పక్కనే ఉన్న స్థలంలో పథకం ప్రకారం ముందుగా కూరగాయల వ్యర్థాలు, చెత్త వేయడం ప్రారంభించారు అనంతరం ఆ స్థలంలో గుట్టు చప్పుడు కాకుండా మట్టి పోసి చదును చేయడం ప్రారంభించాడు.
ఇలా అక్రమార్కులు గత కొంతకాలంగా మార్కెట్ యార్డుకు ఎలాంటి రుసుము చెల్లించకుండా అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ యార్డులో లైసెన్స్ పొందాలంటే సుమారు 20 నుండి 50 లక్షలు ఖర్చు కానుంది. అలాంటిది ఈ అక్రమార్కులు ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ స్థలమైన మార్కెట్ యార్డులో కబ్జాలు చేస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వీరి నిర్వాకంతో మార్కెట్ యార్డులో నిత్యం ట్రాఫిక్ జామవుతూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో యార్డు లోపల వ్యాపారాలు చేసుకునే తమకు నష్టం వాటిల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అధికారికంగా లైసెన్సులు కలిగి నష్టాల పాలవుతున్నానమని వాపోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ యార్డులో జరుగుతున్న కబ్జాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని పలువురు వ్యాపారస్తులు కోరుతున్నారు.