- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
OLA Diwali Sale: కస్టమర్లకు ఓలా దీపావళి ఆఫర్లు.. ఎస్-1 ఈవీలపై భారీ డిస్కౌంట్..!
దిశ, వెబ్ డెస్క్: భారత మార్కెట్(Indian Market)లో ప్రస్తుతం విద్యుత్ వాహనాల(EV)కు ఫుల్ డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజీల్ ఖర్చులు తగ్గుతాయని చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలోనే టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్(Two Wheeler) కంపెనీ ఓలా(OLA) కీలక ప్రకటన చేసింది. కాగా దసరా(Dussehra) సందర్భంగా ఓలా ఇటీవలే ఓ సేల్ తీసుకురాగా.. తాజాగా దీపావళి(Diwali) పండగను పురస్కరించుకొని పలు ఈవీ స్కూటర్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. '72 అవర్స్ రష్(72 hours Rush)' పేరుతో ఈ సేల్ ప్రారంభించింది. అక్టోబర్ 29 నుంచి 31వ తేదీ వరకు ఈ సేల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ సేల్ లో భాగంగా.. ఓలా ఎస్ 1 పోర్టుఫోలియో(S1 Portfolio)లోని వాహనాలపై రూ.25 వేలు తగ్గింపు ప్రకటించింది. అలాగే రూ.30 వేలు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా అందజేస్తోంది. కాగా ఓలా ఎస్ 1 పోర్టుఫోలియో వెహికల్ ధరలు రూ.74 వేల నుంచి ప్రారంభమవుతాయి. ఎస్1 ప్రో(S1 Pro), ఎస్1 ఎయిర్(S1 Air) వంటి హైఎండ్ మోడళ్ల(High-end Models) ధరలు రూ. 1.14 లక్షలుగా ఉంది. అయితే ఈ సేల్ లో ఎస్ 1 వాహనాలపై రూ.25 వేల తగ్గింపుతో పాటు ఫైనాన్స్ ఆఫర్, బ్యాటరీ వారంటీ, ఉచిత సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ లు, ఫ్రీ ఛార్జింగ్ క్రెడిట్స్ , ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇలా రూ.30 వేలు విలువైన ఎక్ స్ట్రా బెనిఫిట్స్ అందజేస్తున్నారు.