- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RCB అభిమానులకు అదిరిపోయే న్యూస్.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..!
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్(IPL) మెగా వేలం ముందు ఆర్సీబీ(RCB) అభిమానులకు అదిరిపోయే వార్త అందనుంది. ఆ బెంగళూరు జట్టు రిటైన్ చేసుకునే ప్లేయర్లు ఎవరనే దానికంటే ముందు.. అసలు ఆ జట్టు కెప్టెన్‌గా ఎవరు కొనసాగుతారనే ప్రశ్న అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో జాతీయ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి కెప్టెన్ గా తానే కొనసాగుతానని.. విరాట్ కోహ్లీ (Virat Kohli) టీమ్ యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తుంది. కోహ్లీ కెప్టెన్సీ ప్రపోజల్‌ను ఆర్సీబీ యాజమాన్యం కూడా వెంటనే ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై ఆర్సీబీ(RCB) జట్టు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం వన్డే, టీ20 ఫార్మెట్లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్సీబీ జట్టు ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటుందో ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. కానీ పలువురు విశ్లేషకులు మాత్రం కోహ్లీతో పాటు, రజత్ పాటిదార్, మహ్మద్ సిరాజ్, మ్యాక్స్ వెల్, విల్ జాక్స్ లను రిటైన్ చేసుకొని.. మరో ప్లేయర్ ను ఆర్టీఎమ్ ద్వారా తీసుకొవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రానుంది.