- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రూప్-1 రద్దుపై డివిజన్ బెంచ్‌కు TSPSC
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై టీఎస్ పీఎస్సీ సోమవారం అప్పీలుకు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. అత్యవసర విచారణ నిమిత్తం లంచ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై రేపు విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ అనుమానాస్పదంగా ఉందని పలువురు అభ్యర్థులు దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్.. ఈ పరీక్షను రద్దు చేస్తూ దాని స్థానంలో మరోసారి పరీక్ష నిర్వహించాలని ఈ నెల 23న తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై టీఎస్ పీఎస్సీ తాజాగా డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ప్రిలిమ్స్ పరీక్షను రెండున్నర లక్షమ మంది అభ్యర్థులు రాశారని పరీక్ష సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని టీఎస్ పీఎస్సీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్ష రద్దు చేయడం సబబు కాదని కోర్టుదృష్టికి తీసుకువెళ్లింది. దీంతో డివిజన్ బెంచ్ నిర్ణయం ఎలా ఉండబోతున్నది ఆనేది ఆసక్తిగా మారింది.