జీవో 317పై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-07-06 14:53:45.0  )
జీవో 317పై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో జీవో 317కు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో 317 బాధిత ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల స్థానికత, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, జిల్లాల విభజన, జోన్, మల్టీ జోనల్, స్పౌజ్ బదిలీల అంశాలపై చర్చించామన్నారు. 317 జీవో బాధిత ఉద్యోగుల శాశ్వత పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ జీవో సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్ కమిటీ అతి త్వరలో సీఎంకు తుది నివేదిక ఇవ్వనున్నదన్నారు. ఉద్యోగులెవ్వరూ ఆందోళన చెందవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.

Advertisement

Next Story