- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Health: చైనాలో HMPV వైరస్.. అప్రమత్తమైన తెలంగాణ ఆరోగ్య శాఖ
దిశ, వెబ్ డెస్క్: చైనా(China)లో మరో ప్రాణాంతకమైన హెచ్ఎంపీవీ వైరస్(HMPV Virus) విజృంబిస్తోందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ(Telangana health Department) అప్రమత్తమైంది(Alerted). ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్(Health and Family Welfare Department Director) విడుదల చేశారు. ఇందులో చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని, దీని ద్వారా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్(Respiratory Infections) సంబంధ వ్యాదులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. అయితే ఇప్పటివరకు తెలంగాణలో ఇలాంటి కేసులు నమోదు కాలేదని చెబుతూ.. ఇవి రాకుండా ఉండేందుకు మార్గదర్శకాలను(Guidelines) విడుదల చేశారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులను తరచూ కడగాలని సూచించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లకూడదని, మంచి ఆహారం తీసుకోవాలని, కరచాలనాలు చేయవద్దని, డాక్టర్ ను సంప్రదించకుండా మెడిసిన్ వాడవద్దని పలు మార్గదర్శకాలు జారీ చేశారు.