Health: ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని దిగజారుడు రాజకీయాలు.. మంత్రి దామోదర ఫైర్

by Ramesh Goud |   ( Updated:2024-12-10 14:49:56.0  )
Health: ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని దిగజారుడు రాజకీయాలు.. మంత్రి దామోదర ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఆశా వర్కర్లను (Asha Workers) అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల(Opposition Leaders) దిగజారుడు తనానికి నిదర్శనమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Health Minister Damodar Rajanarsimha) అన్నారు. కేటీఆర్(KTR) వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని విమర్శించారు. గత పదేళ్ళ పాలనలో ఆశా వర్కర్ల వేతనాల పెంపు పై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఇది వారి ద్వంద వైఖరి కీ నిదర్శనమన్నారు.

అలాగే 2015 లో 106 రోజులు వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ఆశా వర్కర్లను గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని, 2018, 2020, 2021, 2023 సంవత్సరాలలో ఆశా వర్కర్లు సమ్మెలు, ధర్నా లు చేశారని మంత్రి గుర్తు చేశారు. అప్పుడు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించలేని వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆశా వర్కర్లు సంయమనంతో వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రభుత్వం ఆశా వర్కర్ల స్వేచ్ఛను గౌరవిస్తుందని, రాజకీయ ప్రేరేపిత ధర్నా, నిరసనలు తెలిపే వారి ఉచ్చులో పడొద్దని సూచించారు. అంతేగాక శాంతి భద్రతలకు భంగం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఆశా వర్కర్ల నిరసనలో సొమ్ముసిల్లి పడిపోయిన ఆశా వర్కర్ రహీం బీ(Raheem Bee)కి ఉస్మానియా ఆస్పత్రిలో(Osmania Hospital) మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మంత్రి దామోదర్ అదేశించారు.

Next Story

Most Viewed