తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం కోకాపేట్‌(Kokapet)లోని ఆయన నివాసంలో మీడియాలో మాట్లాడారు. హైదరాబాద్(Hyderabad) బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్(Law and order) ఉందా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. తమపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా.. రాచమర్యాదలు చేశారని ఆవేదన చెందారు. ఒక్క ఘటనలో కూడా నిందితులను అరెస్ట్ చేయలేదని అన్నారు. ఈ దాడులన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. రేవంత్ వ్యవహారశైలి వల్లే ఆ పార్టీ నేతలు అలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మాపై దాడులు చేయాలని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. మరి నిన్న అరికెపూడి గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు.

ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి అజెండా అని అర్థం అవుతోందని అన్నారు. 14 ఏళ్ల ఉద్యమకాలంలోనూ ఇలాంటి అణిచివేతలు చూడలేదని తెలిపారు. రాష్ట్ర డీజీపీ బాధ్యాయుతంగా వ్యవహరించాలని కోరారు. గతంలో పోలీసులను తిట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని గుర్తుచేశారు. అరికెపూడి గాంధీని నిన్ననే హౌజ్ అరెస్ట్ చేసి ఉంటే.. కౌశిక్ రెడ్డిపై దాడి జరిగి ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే.. డీజీపీని ఇష్టమొచ్చినట్లు తిట్టారు. నిన్న తమను అరెస్ట్ చేస్తుంటే పోలీసులకు సంపూర్ణంగా సహకరించాం. ఇది కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఉన్న తేడా? అని అన్నారు.

Advertisement

Next Story