- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao:‘విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు’.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘన అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్వేలో 36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను భాగం చేస్తూ ఈ నెల 1న విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశం అన్నారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల పై ఉన్న నమ్మకం రోజు రోజుకీ దిగజారుతున్నదన్నారు. మీ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయని, ఇప్పుడు కుటుంబ సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ, విద్యా వ్యవస్థపే నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయులను జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ విధులు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తుందన్నారు. ఇవి కాకుండా మరే ఇతర పనులకు వినియోగించకూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తుందన్నారు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం కూలి నాలి చేసుకునే వారేనని, అకస్మాత్తుగా ఒంటిపూట బడులు నడపడంతో పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయని, పిల్లల చదువులు కుంటుపడటం తో పాటు వారి భవిష్యత్తు పై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.