Harish Rao: సాయిబాబా వేదనకు ఎవరు సమాధానం చెబుతారు?: హరీశ్ రావు

by Prasad Jukanti |
Harish Rao: సాయిబాబా వేదనకు ఎవరు సమాధానం చెబుతారు?: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, నిర్దోషిగా బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రొ.సాయిబాబా మరణించడం శోచనీయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రొ.సాయిబాబా మరణించిన నేపథ్యంలో సోమవారం ఉదయం మౌలాలి లోని సాయిబాబా నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు సాయిబాబా మృతి బాధాకరం అని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సుప్రీంకోర్టు నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. కానీ దశాబ్ద కాలం పాటు ఆయనతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం అన్నారు. ప్రొఫెసర్ గా పని చేస్తూ, ఆ హొదాలోనే ప్రాణాలు వదలాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఉద్యోగం కూడా కోల్పోయారని, వంద మందికి శిక్ష పడినా ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు అనేది న్యాయ సూత్రం. ఇది సాయిబాబా విషయంలో వర్తిస్తుందన్నారు. సాయిబాబా పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తి పట్ల అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం బాధాకరం అని. సాయిబాబా నిర్దోషిగా బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చే సమయంలో ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేశారు. తన శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేసిన సాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు.

Next Story

Most Viewed