- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సన్నవడ్లకే బోనస్.. కాంగ్రెస్ సర్కారుపై హరీష్ రావు సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: సన్నవడ్లకే రూ.500 బోనస్ అని కాంగ్రెస్ ప్రకటించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సన్నవడ్లకే బోనస్ ఇస్తామనడం దారుణం అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో ప్రజలను ముంచిందన్నారు. ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో దొడ్డు బియ్యం పండించే రైతులు నట్టేట మునుగుతున్నారని తెలిపారు. తెలంగాణలో 10 శాతం మాత్రమే సన్న వడ్లను పండిస్తారని.. 90 శాతం మంది రైతులకు ఈ బోనస్ అందే చాన్స్ లేదన్నారు.
ఎన్నికల సందర్భంగా వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారని ఇప్పుడు కేవలం సన్న వడ్లకు బోనస్ ఇస్తామనడం ఏంటని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతుబంధు విషయంలో, బోనస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందన్నారు. విత్తనాలు నాటక ముందే పంటకు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అయితే వర్షాలు ప్రారంభం అవుతున్నందున జూన్ నెల ప్రారంభంలోనే రైతు బంధు కింద ఎకరానికి రూ.7,500 ఇవ్వాలని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.