రేపు గురుకుల ఎంట్రన్స్ టెస్ట్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-02-22 15:02:39.0  )
రేపు గురుకుల ఎంట్రన్స్ టెస్ట్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రేపు జరిగే గురుకుల (Gurukula) ఎంట్రన్స్ టెస్ట్ (Entrance Test) ప్రశాంతంగా నిర్వహించాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabakar) సూచించారు. గురుకుల ప్రవేశ పరీక్షపై ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందించిన ఆయన విద్యార్ధులకు శుభాకాంక్షలు (Wishes) చెప్పారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ (All The Best) అని చెప్పారు. అలాగే గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (Gurukula Common Etrance Test) కోసం మొత్తం 1,67,708 అప్లికేషన్లు (Applications) వచ్చాయని తెలిపారు.

643 ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 51,968 సీట్లు ఉండగా, ఇందులో కేవలం ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసమే 88,824 అప్లికేషన్లు, 6వ తరగతి ఎంట్రన్స్ కోసం 32,672 అప్లికేషన్లు వచ్చాయని అన్నారు. అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థులంతా తప్పనిసరిగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలని సూచించారు. గురుకులాలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని, నాణ్యమైన విద్యతో పాటు మెస్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు. ఇక రేపు జరిగే గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధ్యార్థులంతా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి! అని మంత్రి రాసుకొచ్చారు. కాగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ప్రవేశం కోసం విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed