గ్రూప్-2 దరఖాస్తు గడువు పొడిగించాలి.. టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు వినతి

by Vinod kumar |
గ్రూప్-2 దరఖాస్తు గడువు పొడిగించాలి.. టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్ అప్లై గడువును పొడిగించాలని తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం, విద్యార్థి జన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ.జనార్ధన్ రెడ్డికి నిరుద్యోగులు, వీజేఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ - 2 అప్లై చేసుకునే సౌకర్యం రెండు వారాలు పొడిగించాలని అన్నారు.


చివరి మూడు రోజులగా ఇంటర్నెట్ కనెక్షన్ అసౌకర్యం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అప్లై చేసుకోలేకపోయారని తెలిపారు. మానవీయ కోణంలో ఆలోచించి అప్లై గడువును పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వీజేఎస్ నాయకులు, నిరుద్యోగులు, గ్రూప్ - 2 అభ్యర్థులు బాల రాజ్, భీమ్ సేన్, నారాయణ రాథోడ్, మహేశ్, పవన్, నరేష్, శంకర్, ప్రశాంత్, సరళ, హేమ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story