రాజ్ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

by Mahesh |   ( Updated:2024-08-15 16:26:16.0  )
రాజ్ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
X

దిశ, వెబ్ డెస్క్: 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాజ్ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ విముక్తి కోసం పోరాడిన అసంఖ్యాక దేశభక్తుల త్యాగాలను కొనియాడారు. అలాగే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ ప్రయాణాన్ని ప్రస్తావించారు. ప్రతి భారతీయుడు దేశం పట్ల గర్వంగా భావించాలని, దేశం, తెలంగాణ రాష్ట్రం రెండూ వేగంగా అభివృద్ధి చెందడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. కాగా తెలంగాణ గవర్నర్ హోదాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొట్టమొదటి సారి జాతీయ జెండాను ఎగురవేశారు.

Advertisement

Next Story