అదే సీన్ రిపీట్.. రాజ్‌భవన్‌లో గవర్నర్.. ప్రగతి భవన్‌లో సీఎం

by Nagaya |   ( Updated:2023-01-24 02:25:56.0  )
అదే సీన్ రిపీట్.. రాజ్‌భవన్‌లో గవర్నర్.. ప్రగతి భవన్‌లో సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రిపబ్లిక్ డే ఉత్సవాలు ఈ సారి కూడా వేర్వేరుగానే జరగనున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్‌భవన్‌లో నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో జరుపుకుంటారు. ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడికక్కడే నిర్వహించుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారకంగా పబ్లిక్ గార్డెన్స్ లాంటి కామన్ ప్లేస్‌లో జరిపే అవకాశాలు తక్కువే. గత సంవత్సరం కూడా గవర్నర్, ముఖ్యమంత్రి వేర్వేరుగానే వారివారి స్థానాల్లోనే జరుపుకున్నారు. ఈ సంవత్సరం కూడా అదే సీన్ రిపీట్ కానున్నది. రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ఎవరికి వారు విడిగానే జరుపుకోవాల్సి వస్తున్నది. వరుసగా రెండో సంవత్సరం వేర్వేరుగానే ఉత్సవాలు జరుగుతున్నయి.

ఇదే విషయాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణకు సంబంధించి తనకు సమాచారంగానీ, ఆహ్వానంగానీ అందలేదని, స్పీచ్ కాపీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. గవర్నర్‌కు ప్రోటోకాల్ కల్పించడంలో, గౌరవ మర్యాదలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన తీరులో వ్యవహరించడంలేదని తమిళిసై సౌందర్‌‌రాజన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా మీరే చూస్తారుగా అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశింగ్ గవర్నర్ వ్యాఖ్యానించారు. గతేడాది అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని గవర్నర్ చేసిన కామెంట్లకు తగినట్లుగానే ఈసారి కూడా గణతంత్ర వేడుకలు విడివిడిగానే జరగనున్నాయి.

Also Read...

కేసీఆర్ ముందస్తు ప్లాన్.. వ్యూహత్మకంగా బీజేపీ అడుగులు

Advertisement

Next Story

Most Viewed