- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేస్తే.. బీఆర్ఎస్‌లో ఒక్క ఎమ్మెల్యే మిగలరు: ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కేసీఆర్ రాష్ట్రంలో రాచరిక పాలన చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చుని సెంటిమెంట్‌తో మరోసారి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయంతో పాటు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ వీడుతుండటంతో అలర్ట్ అయిన కేసీఆర్.. వరుసగా ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ఫామ్ హౌజ్‌లో భేటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేతలకు భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే పవర్ అని.. పార్టీ ఎవరూ వీడొద్దని ధైర్యం చెబుతోన్న విషయం తెలిసిందే.