- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ రెడ్డి ఇంటి ముందు ప్రభుత్వ టీచర్ల నిరసన.. అపాయింట్మెంట్ లేదని పంపిన సిబ్బంది!
దిశ, వెబ్‌డెస్క్: 317 జీవో విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదంటూ సిబ్బంది వెళ్లిపొమ్మందని ప్రభుత్వ టీచర్లు రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఎంత నష్టపోతున్నామో మాకు తెలునని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా ఈ జీవో అంశంను చేర్చడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం తమ బాధలు పెడచెవిన పెట్టిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ బాధలు అర్థం చేసుకుని 317 జీవో విషయంలో ప్రభుత్వ టీచర్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జీవో 317, 46 బాధితులకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇక గతంలో జీఓను రద్దు చేయాలంటూ కొంతమంది ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.