CM KCR: సీఎం కేసీఆర్ ప్రకటనతో పేదల్లో చిగురిస్తున్న ఆశలు

by sudharani |   ( Updated:2023-04-28 15:02:36.0  )
CM KCR: సీఎం కేసీఆర్ ప్రకటనతో పేదల్లో చిగురిస్తున్న ఆశలు
X

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పేదలకు ఇళ్ళ స్థలాలపై ఆశలు చిగురించాయి. గురువారం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీలో చేసిన ప్రకటన పేదలకు నివేశ స్థలాల వ్యవహారానికి ఊతమిచ్చినట్లయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం గురించి మాత్రమే ప్రకటన చేస్తూ కొన్ని చోట్ల నిర్మించి పంపిణీ చేసింది. గత బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా పేదలు నిర్మించుకునే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల వరకు సహాయం చేస్తామని ప్రకటించింది. అవి రెండు కూడా కార్యరూపం దాల్చకముందే సీఎం కేసీఆర్ ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తామని చేసిన ప్రకటనపై పేదల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రభుత్వ స్థలాలను అమ్మే రియల్ దందాను చేపట్టగా అక్కడ వెంచర్ల ఏర్పాటు జరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ రూరల్ మండలంలో 360ఎకరాల్లో జరుగుతున్న వెంచర్ ఏర్పాట్లు నిలిచిపోతాయా..? లేదా రెండు గ్రామాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తారా అన్న సంశయం వ్యక్తమవుతోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు వన రుల కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వ భూములను అమ్మ కానికి పెట్టింది. ఏకంగా ప్రభుత్వమే రియల్ దందా చేపట్టిన విషయం తెల్సిందే. కామారెడ్డి పట్టణ శివారులో బైపాస్‌కు ఆనుకుని ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను అమ్మడంతో పాటు ప్లాట్ల విక్రయాలను చేపట్టింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆరుకిలో మీటర్ల దూరంలోని మల్లారంలో 81ఎకరాల్లో వెంచర్ ను వేసి ప్లాట్లను విక్రయిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా నిజామాబాద్ రూరల్ మం డలం మల్కాపూర్ (ఏ) గ్రామంలో 339సర్వే నంబర్లో 360ఎకరాల్లో వెంచర్‌కు సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది. మల్కాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో 300మంది ఇళ్ల స్థలాలు లేని పేదలకు తమకు ప్రభుత్వం చేయదల్చిన వెంచర్‌లో భూములను దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ఇచ్చే (బీపీఎల్) రూపంలో ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రభుత్వం అక్కడ వెంచర్‌లు ఏర్పాటు చేయడంతో నిరసనలకు దిగుతున్నారు. గ్రామంలో అక్కడే టెంట్ వేసి గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 17న కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి జిల్లా పాలనాధికారికి వినతిపత్రం కూడా సమర్పిం చారు. ప్రభుత్వం ద్వారా, వెంచర్ల ద్వారా ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ మండలం మాల్కాపూర్ (ఏ)గ్రామా రెవెన్యూలో గల సర్వే నెం 339లో 360ఎకరాల 30గుం టల ప్రభుత్వ మిగులు భూమిని ప్రభుత్వం, ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని బీఎస్పీ రూరల్ ఇన్ చార్జి కళా శ్రీనివాస్ అన్నారు. మల్కాపూర్, లక్ష్మాపూర్ గ్రామాలలో గుంట భూమి లేని నిరుపేద కుటుంబాలు సుమారు 300ఉన్నాయి. ఆ భూమిని భూమిలేని అర్హులకు పట్టాలు ఇవ్వాలని గత 8 నెలలుగా ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించుకున్న వారి గోడు వినడం లేదు. గత 20రోజులగా ఇరు గ్రామాల ప్రజలు దీనిపై దర్నా నిర్వహిస్తున్నారు. ఆ భూమి పేదలకే చెందాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story