Harish Rao : వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అస్వస్థతకు ప్రభుత్వానిదే బాధ్యత : హరీశ్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అస్వస్థతకు ప్రభుత్వానిదే బాధ్యత : హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల(Vankidi Tribal Ashram School) 60 మంది విద్యార్థుల అస్వస్థతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి టీ.హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. వాంకిడి ఘటనను ట్వీట్ చేసిన హరీశ్ రావు ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతుందని మండిపడ్డారు. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమవుతున్నదన్నారు. వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు.

స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్ని్ంచారు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలం అయ్యారని ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉందని, రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed