MP ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్ బిగ్ స్కెచ్.. ఆ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం..?

by Satheesh |   ( Updated:2024-01-06 00:30:46.0  )
MP ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్ బిగ్ స్కెచ్.. ఆ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ లీడర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. వచ్చే వారంలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతిలోపే కొన్ని జీవోలు రిలీజ్ కానున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నది. కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో పాత డిస్ట్రిక్ట్‌కు ముగ్గురు చొప్పున.. కనీసం 25 నుంచి 30 మంది కి పోస్టులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టింది. ఇన్ చార్జీ మంత్రుల నేతృత్వంలో నామినేటెడ్ పదవుల అభ్యర్ధుల జాబితానూ టీపీసీసీ సేకరించింది. ఆ లిస్టులోని పేర్లను ఫిల్టర్ చేసి ప్రభుత్వానికి సింగల్ నేమ్‌తో జాబితా పంపనున్నది. సీఎం, క్యాబినెట్ మంత్రుల నిర్ణయంతో కార్పొరేషన్ చైర్మన్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోన్నది.

నేతల్లో జోష్ నింపేందుకు..?

సంక్రాంతిలోపు కొన్ని నామినేటెడ్ పదవులు నింపితే సెకండ్ కేడర్, క్షేత్రస్థాయి లీడర్లలో కొంత జోష్ వస్తుందనేది పార్టీ విశ్వాసం. చైర్మన్ పదవులు ఇవ్వడం వలన ఆయా నేతలు ఉత్సాహంగా పని చేయడమే కాకుండా, అనుచరులనూ ప్రోత్సహిస్తూ పార్టీ విజయానికి సులువుగా కృషి చేయొచ్చనేది పార్టీ భావన. పైగా నామినేటెడ్ పదవులు ప్రకటన మొదలైతే, లీడర్లు, కార్యకర్తల్లోనూ పార్టీపై భరోసా పెరుగుతుంది. మరోవైపు ఫస్ట్ రౌండ్‌లో చైర్మన్ పదవులు పొందలేకపోయినోళ్లూ గుర్తింపు కోసం మరింత యాక్టివ్‌గా పనిచేసే ఛాన్స్ ఉన్నది. ఇవన్నీ ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పతాయని పార్టీ బలంగా నమ్ముతున్నది. ఇదే ప్రపోజల్‌ను సర్కార్‌కు వివరించగా, సీఎంతో పాటు క్యాబినేట్ మంత్రులూ ఒకే చెప్పినట్లు సమాచారం. దీంతో సంక్రాంతిలోపు నామినేటెడ్ పదవులు జోష్ మొదలు కానున్నది.

సర్కార్ స్ట్రాటజీ..?

రాష్ట్రంలో పవర్ పొందిన కాంగ్రెస్.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు రెడీ చేస్తున్నది. ఇప్పటికే 15 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకోగా, 12కు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ, ప్రభుత్వం చర్చించి ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల కోసం గాంధీభవన్‌లోని నేతలతో పాటు జిల్లాల్లోనూ లీడర్లు పోటీపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వీటిలో కొన్ని క్యాబినేట్‌తో కూడిన చైర్మన్లు ఉండగా, మరి కొన్నింటికి లేవు.

కీలక నేతలంతా క్యాబినేట్‌తో కూడిన చైర్మన్ పోస్టు కోసం పోటీ పడుతుండగా, ఏ చైర్మన్ ఇచ్చినా తమకు పర్వాలేదని మరి కొంత మంది నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం మొదట్నుంచి పని చేసినోళ్లతో పాటు ఎన్నికల ముందు పార్టీ విజయం కోసం కృషి చేసినోళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. దీంతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి, చివరి నిమిషంలో టిక్కెట్లు కోల్పోయినోళ్లూ కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వివిధ విభాగాలు ఉన్నాయి.

పార్టీకి అనుకూలంగా ఆయా చైర్మన్లు సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం వర్క్ చేశారు. ఇప్పుడు ఆయా విభాగాల చైర్మన్లనే ప్రభుత్వంలోకి తీసుకోవాలని సీఎంతో పాటు మెజార్టీ క్యాబినేట్ మంత్రులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మిగతా శాఖల కార్పొరేషన్లను కూడా పార్టీ కోసం పనిచేసినోళ్లకు అవకాశం కల్పిస్తూనే సమీకరణాలనూ పరిగణలోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. కార్పొరేషన్ల పదవులను దక్కించుకునేందుకు ఇటు సీనియర్లతో పాటు యంగ్ లీడర్లూ పోటీ పడటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed