ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన

by Mahesh |
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన
X

దిశ ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన పర్యటనకు అత్యంత ప్రాధాన్యం నెలకొంది. టీపీసీసీ చీఫ్ హోదాలో ఆయన పర్యటన జరుగుతుండగా త్వరలోనే జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం తో పాటు రానున్న లోకల్ బాడీస్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు ఆయన పర్యటన వ్యవహారాలను వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ హాజరుకానున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లక్ష్యం..

త్వరలోనే జరగనున్న ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలపైనే నేడు జరగకుండా జరగనున్న కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టనుంది. దీనిపైనే సోమవారం జరుగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటిదాకా అభ్యర్థి ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకొనక పోయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని బరిలో ఉంచిన గెలిపించే బాధ్యతను అన్ని నియోజకవర్గాల బాధ్యులు తీసుకునేలా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించే అభ్యర్థుల దరఖాస్తులు సైతం తీసుకునే అవకాశం ఉంది.

స్థానిక సంస్థలపైనా..

రాష్ట్రంలో జరుగుతున్న జనాభా గణన పూర్తయిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలపై కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలకు ప్రత్యక్షంగా సూచనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటినుంచి అభ్యర్థుల ఎంపిక మొదలు గెలిచే అవకాశం ఉన్న వారి పూర్తి సమాచారాన్ని సేకరించాలని పార్టీ శ్రేణులకు సూచించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ శాసనసభ్యులు ఓడిపోయిన అభ్యర్థులు ఆయా పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు

Advertisement

Next Story

Most Viewed