Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గుడి కట్టిన రిటైర్డ్ సైనికుడు

by Prasanna |   ( Updated:2025-01-06 10:54:23.0  )
Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గుడి కట్టిన రిటైర్డ్ సైనికుడు
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరోలకు అభిమానులు ఏ రేంజ్లో ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ హీరో మూవీ వస్తుందంటే చాలు.. వారం రోజుల నుంచే రచ్చ రచ్చ చేస్తారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి థియేటర్ ముందు హడావుడి చేస్తారు. ఇది మాత్రమే కాకుండా, బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా గ్రాండుగా చేస్తుంటారు. కొందరేమో తమ అభిమాన హీరో కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. మరికొందరేమో అన్నదానం నిర్వహిస్తారు. ఇంకొందరైతే ఏకంగా గుడి కట్టేస్తున్నారు. ఇప్పటికి, ఎంతో మంది తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా, సూపర్ స్టార్ అభిమాని తాను ఎంతగానో ఇష్టపడిన హీరో కోసం గుడి కట్టాడు.

తాజాగా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ( Rajinikanth ) ఓ అభిమాని గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మధురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తీక్ రిటైర్డ్ సైనికుడు. అతనికి రజినీకాంత్‌ అంటే చాలా ఇష్టం. దీంతో, తన ఫేవరేట్ హీరోపై ప్రేమను ఈ విధంగా వ్యక్తపరిచాడు.

అతని ఆలోచనలో ఇప్పుడు రజనీ కాంత్ దేవుడిలా కనిపిస్తున్నాడు. అతని కోసం కార్తీక్ గుడి కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, ఈ గుడిని వేరే ప్రదేశంలో కాకుండా తన ఇంట్లోనే కట్టించడం విశేషమనే చెప్పుకోవాలి. అంతే కాకుండా, ఇంట్లో నిర్మించిన గుడిలో రజినీ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్, కార్తీక్ అండ్ తన ఫ్యామిలీని ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. రజినీ కాంత్ ఎక్కడైనా సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story