‘మెగా ఇంజనీరింగ్ సంస్థ’ విరాళంపై KTR క్లారిటీ

by Gantepaka Srikanth |
‘మెగా ఇంజనీరింగ్ సంస్థ’ విరాళంపై KTR క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఇంజనీరింగ్ సంస్థ(Mega Engineering) ఇచ్చిన విరాళాలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) క్లారిటీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ్రీన్ కో ద్వారా అన్ని పార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్లు అందుకున్నాయని అన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా అన్ని పార్టీలకు విరాళాలు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌కు కూడా మెగా నుంచి విరాళాలు అందాయని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్(Kodangal Lift Irrigation) కాంట్రాక్టు మెగా ఇంజనీర్‌కు ఇచ్చారని గుర్తుచేశారు. ‘అది కిడ్స్ ఫ్రొకోనా.. హైదరాబాద్ తాగునీటి స్కీం గోదావరి నుంచి 4 వేల కోట్లు మెగాకే ఇస్తారట అది కూడా అదేనా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

మెగా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని హెచ్ఎండబ్ల్యూ చెప్పిందని.. అయినా మళ్లీ వారికే కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నారని అడిగారు. ‘ఓ కాంట్రాక్టర్ మంత్రి.. బ్రోకర్ ముఖ్యమంత్రి.. అందుకే వారికి అన్ని క్విడ్ ప్రోకో లాగా కనిపిస్తాయి’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎవరెవరి దగ్గర రియల్ ఎస్టేట్ భూములు లాక్కున్నాడో అన్నీ త్వరలో బయటపెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కాదని.. కాంగ్రెస్ అధికారంలో ఉండే మరో నాలుగేళ్లు కూడా ఇలాగే కేసులు ఉంటాయని.. ఫార్ములా ఈ రేస్ కేస్ ఆరంభం మాత్రమే అని తెలిపారు. అన్ని కేసులను ఎదుర్కొంటానని ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed