ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు

by Naveena |
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే  కఠిన చర్యలు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని 1వ,2 వ పట్టణ సిఐ లు అప్పయ్య,ఇజాజోద్దీన్, ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి లు హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా..జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ ప్రధాన కూడళ్ళలో వారు ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ ను నిర్వహించారు. ప్రధానంగా నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి వాటి వివరాలు నమోదు చేసుకుని,చైన్ స్నాచింగ్స్,దొంగతనాల వంటి నేరాలు ఎలా జరుగుతాయో వివరిస్తూ..డ్రైవింగ్ లైసెన్స్,హెల్మెట్ అవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి ఆపి,వాటి యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ మాసోత్సవం సందర్భంగా వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే చైతన్యం రావాలని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా వానాలను వినియోగించడం చట్ట ప్రకారం నేరమని,వెంటనే యజమానులు నెంబర్లను నమోదు చేసుకోవాలని ఆమె ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed