- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG NEWS : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. T కాంగ్రెస్ చెప్పింది ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మూడో విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. 14.45 లక్షల మంది రైతులకు మూడో విడతలో రేవంత్ రెడ్డి సర్కార్ రుణాలు విడుదల చేసింది. ఆగస్టు 15న నిధులు రిలీజ్ చేసిన ఇంకా కొంత మందికి రుణమాఫీ కాలేదని రైతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ స్పందించి.. రైతులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
‘అర్హత ఉన్నా రుణమాఫీ కానీ రైతుల కోసం రేవంత్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఆధార్‌లో తప్పుంటే.. బదులుగా ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే.. సరిచేసే పోర్టల్ నమోదు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్ధారణ, దిద్దుబాటు చర్యలు, ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ.. కొత్తగా మార్గదర్శకాలు జారీ’ అని పోస్ట్ చేసింది.