- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓట్ల కోసం దేవుడిని వాడుకుంటున్నారు: జగ్గారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని కొనియాడారు. ఎన్నికల వేళ బీజేపీ ఆలయాల పేరిట రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అయోధ్యలో రామాలయం కడితే సమస్యలు సమసిపోతాయా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం దేవుడిని వాడుకునే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాహుల్ రాముడు మెచ్చిన పాలన చేస్తారని వెల్లడించారు. రాహుల్ నాయకత్వం ముందు ఈటల రాజేందర్ రాజకీయ జీవితం చిన్నదని జగ్గారెడ్డి అన్నారు. గుళ్లు కడితే ఉద్యోగాలు వస్తాయా? యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. గడిచిన పదేళ్లలో బీజేపీ పాలనలో పెద్దఎత్తున అప్పులు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయేనని, రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.