‘ఉద్యోగ భద్రత కల్పించండి’.. సీఎం రేవంత్‌కు గిగ్ వర్కర్ల విజ్ఞప్తి

by Satheesh |   ( Updated:2023-12-23 15:16:39.0  )
‘ఉద్యోగ భద్రత కల్పించండి’.. సీఎం రేవంత్‌కు గిగ్ వర్కర్ల విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఓలా, ఉబెర్, ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన ఈ భేటీకి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రే తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రతతో పాటు నెలవారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్లు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆన్ లైన్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై తాత్కాలికంగా పని చేస్తున్న గిగ్ వర్కర్లతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం అయి తమ ప్రభుత్వం ఏర్పడితే రాజస్థాన్ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో భేటీ కావడం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story