GHMC: మూసీ పనులు షురూ.. టెండర్లకు ఆహ్వానం

by srinivas |
GHMC: మూసీ పనులు షురూ.. టెండర్లకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీనం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే దక్షిణ కొరియాలోని నదుల సుందరీకరణ, మురునీటి శుద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి మంత్రులు, అధికారుల బ్రందం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన ప్రాజెక్టులను జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు చేపడుతున్నాయి.

రూ.580కోట్లతో…

జీహెచ్ఎంసీ పరిధిలో 1302 వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంది. వీటిలో మేజర్, మైనర్ నాలాలు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం మురుగునీటి నాలాలు, వరదనీటి కాలువలు కలిసిపోతున్నాయి. మురుగునీటితో వర్షపు నీరు కలిసి మూసీలో కలుస్తుంది. అయితే మూసీ ప్రాజెక్టులో భాగంగా ఈ రెండింటిని వేర్వేరుగా చేయనున్నారు. మురుగునీటిని సీవరేజ్ ట్రీట్ ప్లాంట్(ఎస్టీపీ)లోకి పంపించి శుద్ధి చేసిన తర్వాతనే మూసీలో పంపించేవిధంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంతోపాటు నాలా వ్యవస్థతోపాటు వరద నీటి కాలువ వ్యవస్థను సైతం పటిష్టం చేయాలని, వరద నీరంతా మూసీలోకి నేరుగా వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ రూ.580కోట్లతో 43 ప్రాంతాల్లో 58కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని నిర్ణయించింది. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొన్ని పనులకు జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వనించింది.

Advertisement

Next Story

Most Viewed