GHMC Commissioner : చాదర్‌ఘాట్ వంతెన వద్ద భారీ ప్రవాహం.. మూసీకి వరద.. కమిషనర్ ఆమ్రపాలి

by Ramesh N |   ( Updated:2024-09-01 12:47:40.0  )
GHMC Commissioner : చాదర్‌ఘాట్ వంతెన వద్ద భారీ ప్రవాహం.. మూసీకి వరద.. కమిషనర్ ఆమ్రపాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న జలాశాలయాలకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్‌ నుంచి నీటిని మూసీలోకి వదులు తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ వంతెనల వద్ద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలోనే చాదర్‌ఘాట్ వంతెనకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భారీ వర్షాల కారణంగా చాదర్‌ఘాట్ వంతెన వద్ద మూసీ నది గణనీయమైన ప్రవాహాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. పౌరులందరూ తమ భద్రత కోసం ఇళ్లలోనే ఉండాలని కోరారు. దయచేసి ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story